ప్రభుత్వ సూచనతో సన్నరకాల ధాన్యం వేసిన రైతులకు ఈసారి పంట నష్టం వాటిల్లిన దృష్ట్యా పరిహారం చెల్లించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కచ్చితంగా 40శాతం సన్నరకాల పంట వేయాలని సూచించడం వల్లే రైతులు ఈ పంటను వేశారని... అది ఇప్పుడు చేతికి వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వెదిర, కోనరావుపేట తదితర ప్రాంతాల్లో వ్యవసాయాధికారులతో కలిసి వరి పొలాలను పరిశీలించారు.
'సన్నరకం వరి వేసిన రైతులను ఆదుకోవాలి' - రైతులకు నష్టం పరిహారం చెల్లించాలన్న తెదేపా నేతలు
సన్నరకం వరి ధాన్యానికి ఈసారి ఎక్కువ నష్టం వాటిల్లినందున నష్ట పరిహారం ఇవ్వాలని తెదేపా నాయకులు అన్నారు. సన్నరకాల ధాన్యం వేయాలని ప్రభుత్వమే సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'సన్నరకం వరి వేసిన వారికి పరిహారం చెల్లించాలి'
రైతులు ఎకరానికి దాదాపు రూ.40వేలకు పైగా ఖర్చు చేశారని... ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. పరిహారం చెల్లించి ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ'