కరోనా మహమ్మారి విజృంభిస్తూ పేదల జీవితాలను అల్లకల్లోలం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ... కరీంనగర్ జిల్లాలోని పెట్రోల్ బంకుల ఎదుట కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు గల పెట్రోల్ బంక్లో జరిగిన నిరసన కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వం పెళ్లి సత్యనారాయణలు హాజరయ్యారు.
Ponnam prabhaker:పెట్రోల్ ధరలను నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ ధర్నా - tpcc working president ponnam prabhaker latest news
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు గల పెట్రోల్ బంక్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నం ప్రభాకర్ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

43 సార్లు పెట్రోల్ ధర పెంచడం దారుణమన్న పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర పావలా పైసలు పెరిగితేనే... గాజులు, పసుపు, కుంకుమలు పంపారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఈ 13 నెలల కాలంలోనే దాదాపు 43 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్, డీజిల్, నూనె, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి