తెలంగాణ

telangana

ETV Bharat / state

Ponnam: కరోనాను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చండి: పొన్నం - karimnagar

కరోనా బారినపడిన పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యమందించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కొవిడ్​ అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సత్యాగ్రహ దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

TPCC Working president Ponnam prabhakar
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్

By

Published : Jun 7, 2021, 5:05 PM IST

కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొవిడ్ చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన సత్యాగ్రహ దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యమందించాలని ఇప్పటికే కలెక్టర్లకు, గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామని పొన్నం పేర్కొన్నారు. డిసెంబర్‌లోగా దేశప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే రోజుకు కనీసం కోటి మందికి టీకాలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అయితే ఆచరణలో మాత్రం అది కనబడటం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:T-Congress : 'కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ప్రభుత్వాలు విఫలం'

ABOUT THE AUTHOR

...view details