సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతూ కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు చమురు ధరలు పెంచుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం విమర్శించారు. దేశ జీడీపీ పెంచుతామని ఎన్నికల వాగ్దానం చేసిన భాజపా... వంట గ్యాస్ ధర పెంచుతోందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
'సామాన్యులకు కాంగ్రెస్ విధానాలే శ్రేయస్కరం' - karimnagar district latest news
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచడాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం తీవ్రంగా ఖండించారు. భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజలపై విపరీతంగా భారం వేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ధరల పెరుగుదలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
'సామాన్యులకు కాంగ్రెస్ విధానాలే శ్రేయస్కరం'
సీఎం కేసీఆర్ ధరల పెరుగుదలపై ఎందుకు స్పందించడం లేదని మేడిపెల్లి సత్యం ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస అవినీతి పాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. దళితులు, రైతులు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవంగా ఉండేందుకు కాంగ్రెస్ విధానాలే శ్రేయస్కరమన్నారు.
ఇదీ చదవండి:వాట్సాప్‌లో ఈ ఫీచర్ల గురించి తెలుసా..?