హుజూరాబాద్ ఉప ఎన్నిక (huzurabad by poll) సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) జూమ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు ఇతర ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని సూచించారు.
revanth reddy: 'అలా చేస్తే హుజూరాబాద్‌లో గెలుపు మనదే..' - తెలంగాణ కాంగ్రెస్ తాజా వార్తలు
హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై (huzurabad by poll) కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం జరిగింది.
ప్రధానంగా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలను పరిస్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చెయ్యాలన్నారు. తెరాస, భాజపా దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ గురించి ప్రజలకు వివరించాలన్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రభుత్వాల వైఫల్యాలను పూర్తిస్థాయిలో ప్రచారం చేసి... జనంలోకి తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ జూమ్ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ (tpcc president revanth reddy) రెడ్డితో పాటు, పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి (jagga reddy), మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి (mallu ravi), అభ్యర్థి బలమూరి వెంకట్‌తో (balamuri venkat)పాటు 80 మందికిపైగా నియోజకవర్గ ఇంఛార్జులు, మండల ఇంఛార్జిలు, గ్రామ ఇంఛార్జిలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Huzurabad By Election Campaign: జోరుగా హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం