తెలంగాణ

telangana

ETV Bharat / state

నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే ఎండలు.. - WEATHER REPORT IN TELANGANA

Temperature in TS: రాష్ట్రంలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ అత్యధికంగా పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

TODAY WEATHER REPORT IN TELANGANA
TODAY WEATHER REPORT IN TELANGANA

By

Published : Jun 2, 2022, 9:02 PM IST

నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైనే ఎండలు..

Temperature in TS: రెండు రోజుల క్రితం వరకు అక్కడక్కడ వరుణుడు జల్లులు కురిపించగా.. నిన్నటి నుంచి భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నేడు కూడా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 15 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్​లోని జమ్మికుంటలో గరిష్ఠంగా 45.9 డిగ్రీల ఎండ కొట్టింది.

ABOUT THE AUTHOR

...view details