తెలంగాణ నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించినందున... పరిమిత సంఖ్యంలో ఉద్యోగులు పాల్గొని హోలీ జరుపుకున్నారు.
టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా హోలీ వేడుకలు - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. పరిమిత సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు రంగులతో ఒకరికొకరు తిలకం దిద్దుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
![టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా హోలీ వేడుకలు tngos Holi celebrations in karimnagar district, Holi celebrations in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11203364-565-11203364-1617018530045.jpg)
టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు, కరీంనగర్ జిల్లా హోలీ వేడుకలు
జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఉద్యోగులు రంగులతో ఒకరికొకరు తిలకం దిద్దుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని పలు కాలనీల్లో తమ తమ ఇళ్ల ముందు చిన్నారులు హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఛత్తీస్గఢ్లో సామాజిక వ్యాప్తి దశకు కరోనా!