మానేరు నదిలో చిక్కుకున్న ముగ్గురు మత్య్సకారులు - కరీంనగర్ జిల్లా చల్లూరు తాజా వార్తలు
18:23 September 27
మానేరు నదిలో చిక్కుకున్న ముగ్గురు మత్య్సకారులు
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్య్సకారులు నీటి వరదలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో చోటుచేసుకుంది. చల్లూరుకు చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్‌తోపాటు మరో వ్యక్తి గ్రామ సమీపంలోని మానేరు వాగులోకి చేపట వేటకు వెళ్లారు. చేపలను పట్టేందుకు వాగులోకి దిగి కొంతదూరం వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అందులోనే చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు వాగులో ఉన్న ఒక చెట్టును పట్టుకున్నారు. మరో వ్యక్తి అదే వాగులో ఉన్న బోరు మోటారు పైపును పట్టుకొన్నాడు.
గమనించిన గ్రామస్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించారు. తెలుసుకున్న ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు వాగు వ్దదకు చేరుకున్నారు. నీటి ప్రవాహ వేగాన్ని గమనించి తాళ్ల సహయంతో గ్రామస్థులు వాగులోకి వెళ్లారు. చివరికి నదిలో చిక్కుకున్న ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చూడండి :చలగల్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
TAGGED:
Maneru River latest news