తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు - కరీంనగర్‌ జిల్లా తాజా వార్తలు

కరీంనగర్‌లోని అలుగునూర్ కాకతీయ కాలువలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్వలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతేదేహాలు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెల్లి, బావ, మేనకోడలివిగా గుర్తించారు.

three-bodies-were-found-in-the-kakatiya-canal-at-karimnagar-district
కాకతీయ కాలువలో మరో రెండు మృతదేహాలు లభ్యం

By

Published : Feb 17, 2020, 10:32 AM IST

Updated : Feb 17, 2020, 1:04 PM IST

కరీంనగర్‌ కాకతీయ కాల్వలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు దంపతులు కాల్వలో పడిన ఘటన మరువక ముందే... మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చిన్న సోదరి కుటుంబంగా గుర్తించారు. లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణరెడ్డి, రాధ, వారి కుమార్తె వినయశ్రీగా పోలీసులు నిర్ధారించారు. మూడేళ్ల క్రితం సిరిసిల్ల జిల్లాలోని రగుడు వద్ద సత్యనారాయణ రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు కుటుంబమంతా మృతి చెందటం విషాదం నింపింది.

అసలేం జరిగిందంటే?

ఆదివారం గన్నేరువరానికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంతో అదుపుతప్పి కాలువలోపడిపోయారు. అప్పుడే దారి గుండా వస్తున్న బ్లూ కోట్ పోలీసులు గమనించి ప్రదీప్​ను గట్టుకు చేర్చగా... అతని భార్య ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కెనాల్​లో మృతదేహం కోసం గాలింపు చర్యల్లో భాగంగా నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇదే సమయంలో తిమ్మాపూర్ మండలంలోని యాదవులపల్లి శివారులోని కాకతీయ కాలువలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. క్రేన్‌ సాయంతో కారును పైకి తీయగా కుళ్లిన శవాలు లభ్యమయ్యాయి.

ఈ మృతదేహాలు పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిన్న సోదరి కుటుంబానివిగా గుర్తించారు. నారెడ్డి సత్యనారాయణరెడ్డి, రాధా దంపతులు, వీరి కుమార్తె వినయశ్రీగా పోలీసులు తేల్చారు. వీరి స్వగ్రామం కరీంనగర్ సమీపంలోని లక్ష్మీపురం ప్రస్తుతం కరీంనగర్ లోనే ఉంటున్నారు. 20రోజుల కిందటే కారు కాలువలో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు

ఇవీ చూడండి:సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం

Last Updated : Feb 17, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details