సమ్మె విచ్ఛిన్నానికి తెరాస అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ప్రయత్నిస్తోందని ఏఐటీయూసీ నేత సీతరామయ్య ఆరోపించారు. కానీ కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడవ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంపూర్ణంగా జరిగింది. రామగుండంలోని ఆర్‌జి 1,2,3లో కార్మికులెవరూ విధులకు హజరు కాలేదు. అత్యవసర సిబ్బంది తప్ప కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు.
గోదావరిఖని...
గోదావరిఖని... టూ ఇంక్లైయిన్ బొగ్గుగనిలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్‌ల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని... కేంద్రంతో సీఎం కేసీఆర్ కుమ్మకై కార్మికుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.