తెలంగాణ

telangana

ETV Bharat / state

"జలశక్తి అభియాన్​"తో ప్రజల్లో మార్పు: సతీందర్ పాల్​సింగ్

కరీంనగర్​ జిల్లాలోని బొమ్మనపల్లి గ్రామంలో జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి సతీందర్ పాల్ సింగ్ పర్యటించారు. నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.​

By

Published : Aug 22, 2019, 9:44 AM IST

Updated : Aug 22, 2019, 10:36 AM IST

ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చింది: సతీందర్ పాల్ సింగ్

ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చింది: సతీందర్ పాల్ సింగ్

కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జలశక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి సతీందర్ పాల్ సింగ్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా భూగర్భజలాలు పడిపోతున్న 1592 బ్లాకులను గుర్తించినట్లు ఆయన వివరించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం, గంగాధర, చొప్పదండి, చిగురుమామిడి, రామడుగు బ్లాకులను గుర్తించామన్నారు. ఇక ముందు ప్రభుత్వం తరఫున మంజూరయ్యే ప్రతి బోరుకు రీఛార్జి విధిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 3,4 తేదీల్లో వాన నీటి సంరక్షణపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు సతీందర్‌ పాల్ సింగ్‌ వివరించారు.

Last Updated : Aug 22, 2019, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details