కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలోని అహల్యనగర్‌కు చెందిన యాకుబ్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న యాకుబ్ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు.. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, 2.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
హుజూరాబాద్‌లో పట్టపగలే చోరీ.. - latest crime news in karimnagar
కరీంనగర్ జిల్లాలో దొంగలు పట్టపగలే బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి.. సుమారు రెండున్నర తులాల బంగారం, 20 తులాల వెండిని అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హుజూరాబాద్‌లో పట్టపగలే చోరీ..
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. ఇంటిని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:ఈ ఏడు మార్చి నుంచే భానుడి భగభగలు