సీఐటీయూ ఆద్వర్యంలో థియేటర్లో పనిచేసే కార్మికులు కరీంనగర్ పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమకున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సినిమా థియేటర్ యాజమాన్యాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని... వేతనాలు సరిగ్గా ఇవ్వట్లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల నుంచి పీఎఫ్ కట్ చేసినా... అధికారులతో కుమ్మక్కై తమకు పీఎఫ్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పీఎఫ్ కార్యాలయం ఎదుట థియేటర్ కార్మికుల ధర్నా - theatre workers protest infront of pf office
సినిమా థియేటర్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని పీఎఫ్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
![పీఎఫ్ కార్యాలయం ఎదుట థియేటర్ కార్మికుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3679656-thumbnail-3x2-vysh.jpg)
పీఎఫ్ కార్యాలయం ఎదుట థియేటర్ కార్మికుల ధర్నా