కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున వైన్స్ దుకాణాల ముందు ధర్నాకు దిగారు. జనావాసాల మధ్య ఉన్న వైన్స్, సిట్టింగ్ దుకాణాలను తక్షణమే గ్రామ శివారులోకి మార్చాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మద్యం దుకాణాలను తీసేసి చిన్నారులు, బాలికలు, మహిళలకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. మండల కేంద్రం నడిబొడ్డున ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఆనుకొని వైన్స్ దుకాణాలున్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధుల అండ చూసుకొని స్థానికులకు ఇబ్బందులు తలెత్తిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు.
మద్యం దుకాణాలను తీసేయాలని మహిళల ధర్నా
జనావాసాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను శివార్లకు తరలించాలని వైన్స్ షాపుల ముందు ధర్నాకి దిగారు కరీంనగర్ జిల్లా మహిళలు.
మద్యం దుకాణాలను తీసేయాలని మహిళల ధర్నా