Story of Kites : హలో పిల్లలూ.. బాగున్నారా!..నేను మీ గాలిపటాన్ని.. సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా.. ఇక మీరు నాతో ఆడుకోవడానికి ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. అయితే ఆడుకునే ముందు నా గురించి కొన్ని విషయాలు చెబుతాను. వింటారా..
నా పుట్టుక గురించి..ఐదు వేల ఏళ్ల క్రితం రుగ్వేదలో ఉత్తరాయణ కాలంలో దేవున్ని గాఢ నిద్రలోంచి మేల్కొల్పేందుకు నన్ను ఎగురవేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేను మన ఆసియా ఖండంలోని చైనాలో పుట్టానని మరికొందరు చెబుతుంటారు. ఏడో శతాబ్దంలో చైనాకు చెందిన హుయిన్ షాంగ్ బుద్దిస్ట్ మిషనరీల ద్వారా మన భారతదేశంలో అడుగిడినట్లు పేర్కొంటున్నారు. ఆ తర్వాత నన్ను ఒక సంప్రదాయ పండగ చూస్తున్నారు. అందుకే ఉత్తరాయణ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా నా పేరిట పండగలు, పోటీలు నిర్వహిస్తారు. ఇది ఒక సాంస్కృతిక కృత్యంగా జరుపుతారు.
గుజరాత్ వేదికగా కైట్ ఫెస్టివల్..మన దేశంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో నాతో గడపడానికి ఆసక్తి చూపుతుంటారు. మన దేశంలో 1989లో గుజరాత్‌లోనే మొట్టమొదటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరిగింది. ఆ రోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చి వారు విభిన్నమైన.. పెద్ద పెద్ద గాలిపటాలతో పోటీ పడుతుంటారు. ఏటా జనవరి 14న ఈ ఒక్క రాష్ట్రంలోనే 2 వేల వేదికలపై నుంచి ఎగురవేస్తారు. ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో కూడా పెద్ద ఎత్తున పండగ నిర్వహిస్తున్నారు. క్రమంగా దేశంలోని అన్ని పట్టణాలకూ విస్తరించాను. దశాబ్దం కిందట మన కరీంనగర్‌లో కూడా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. చదువుల్లో ఉన్నతంగా రాణిస్తూనే.. తల్లిదండ్రులను..తోటి వారిని గౌరవిస్తూ ఈ సెలవు రోజుల్లో నాతో సరదాలు పంచుకుంటారని భావిస్తున్నా.