అహింసా మార్గంలో సాధించలేనిది ఏదిలేదని నిరూపించిన గొప్పనేత మహాత్మగాంధీ అని బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బాపూజీ జయంతి వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'బాపూజీ బాటలో ప్రతి ఒక్కరు నడిచినపుడే అసలైన నివాళి' - కరీంనగర్ జిల్లా వార్తలు
బాపూజీ జయంతి వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. మహాత్మ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు కలెక్టర్ కె.శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
!['బాపూజీ బాటలో ప్రతి ఒక్కరు నడిచినపుడే అసలైన నివాళి' 'బాపూజీ బాటలో ప్రతి ఒక్కరు నడిచినపుడే అసలైన నివాళి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9020753-792-9020753-1601626098929.jpg)
'బాపూజీ బాటలో ప్రతి ఒక్కరు నడిచినపుడే అసలైన నివాళి'
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని మంత్రి కొనియాడారు. బాపూజీ నడిచిన బాటలోనే ప్రతి ఒక్కరు నడిచినప్పుడు ఆయనకు నివాళులు అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మహాత్ముడికి నివాళి అర్పించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్