ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరీంనగర్ జిల్లా ఉమ్మడి బెజ్జంకి, గన్నేరువరం జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం హరితహారంపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలని తీర్మానం చేశారు. దీనికి గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూర్తి వసతులు కల్పించాలని కోరారు. సంబంధిత అధికారులు నర్సరీలను పర్యవేక్షించలన్నారు. మొక్కలు నాటేందుకు ఇష్టమైనట్లు గుంతలు తీయొద్దని.. కనీస లోతు తోడాలని శరత్ రావు ఆదేశించారు.
'మండలంలో ఆరు లక్షల మొక్కలు నాటాలి' - ఆరు లక్షల మొక్కలు
కరీంనగర్ జిల్లా ఉమ్మడి బెజ్జంకి, గన్నేరువరం మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు హరితహారంపై సమీక్షించారు. మండలంలో ఆరు లక్షల మొక్కల నాటాలని సూచించారు.
జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు