కరీంనగర్ నగరపాలక ఎన్నికల్లో ఓటేసిన తర్వాత తాను ఫలానా గుర్తుకు ఓటేసానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఓటరును ప్రభావితం చేసే విధంగా మాట్లాడకూడదన్న నిబంధన ఉల్లంఘించారని ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు - కరీంనగర్ జిల్లా వార్తలు
కరీంనగర్ నగరపాలక ఎన్నికల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తాను ఫలానా గుర్తుకు ఓటేసానని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు అయినా కరీంనగర్ అభివృద్దికి నోచుకోలేదని అన్నారు. ఏ అభ్యర్థిని అడిగినా తెరాసకే ఓటేస్తామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. నిబంధననలు ఉల్లంఘించినందుకు తగుచర్యలు తీసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి : లక్ష రూపాయలు విలువచేసే గంజాయి స్వాధీనం
Last Updated : Jan 24, 2020, 10:22 PM IST