తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు.. తొలి పీఆర్‌సీ నివేదికతో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.
'ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు సరికాదు' - తెలంగాణ ఉద్యమం
పీఆర్సీ కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదంటూ తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మండిపడ్డారు. తొలి పీఆర్సీని ఆమోదించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదు'
శాంతియుత పద్ధతిలో విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని జగదీశ్వర్ పేర్కొన్నారు. సీఎంతో చర్చల అనంతరం.. ఎలాంటి పోరాటాలు చేపట్టాలో నిర్ణయించుకుంటామని వివరించారు.
ఇదీ చదవండి:ఈ పీఆర్సీ.. ఉద్యోగులను అవమానించడమే: రేవంత్‌రెడ్డి