కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి 39వ బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపారు. కేసీ క్యాంపులోని ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను అర్చకులు ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి పూలమాలలతో అందంగా అలంకరించారు.
కమనీయంగా.. శ్రీనివాసుడి కల్యాణ వేడుక - 39th Brahmotsava was celebrated at the Sri Venkateswaraswamy Temple in Huzurabad
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 39వ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.
కమనీయంగా.. శ్రీనివాసుడి కల్యాణ వేడుక
ప్రత్యేక పూజా కార్యక్రమాలనంతరం కల్యాణ వేడుకలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు సుమారు మూడు గంటల పాటు కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వం ఆరేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తోంది: కోదండరాం