ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ ముందు సామాజిక కార్యకర్త తొమ్మిది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో గుండు గీయించుకుని నిరసన తెలిపాడు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. తప్పిదాలకు కారణమైన వారిని శిక్షించాలని... వారిని పదవుల నుంచి తొలిగించాలని డిమాండ్ చేశాడు.
'వారి తల్లిదండ్రులను ఆదుకోండి..' - collectrate
ఇంటర్ విద్యార్థులను రాష్ట్రప్రభుత్వం పొట్టన పెట్టుకుందని... ఇంటర్ బోర్డ్ తప్పిదంతోనే వారు ఆత్మహత్యలు చేసుకున్నారని కరీంనగర్ కలెక్టరేట్ ముందు సామాజిక కార్యకర్త నిరసన వ్యక్తం చేశాడు.

కలెక్టరేట్ ముందు నిరసన