ఇకనుంచి యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం - karimnagar
ఎన్నికల కోడ్ కారణంగా మూడు నెలల నుంచి నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. నేటి నుంచి యథావిధిగా కొనసాగుతోందని కరీంనగర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం
ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. ప్రతి సోమవారం యథావిధిగా కొనసాగుతుందని కరీంనగర్ ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని అందరూ దీనిని సద్వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కిందిస్థాయి ఉద్యోగులకు ఆయన సూచించారు.