కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సత్వరమే సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న అధికారుల మాటలు నీటి మూటలుగా మిగిలాయి. విధుల్లో వున్న అధికారులు ఫిర్యాదుదారులు ఇచ్చే అర్జీలు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. తన భూ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమానికి 116 సార్లు వచ్చినట్టు ప్లకార్డుతో జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముందు నిలుచున్నాడు ఓ వ్యక్తి. తనను పట్టించుకోకుండా శ్యాం ప్రసాద్ ఆర్డీవో దగ్గరికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఫిర్యాదు దారుడు ప్రైవేట్ విద్యా సంస్థలకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు వత్తాసు పలుకుతున్నారని నిరసన తెలిపాడు.
116 సార్లు వచ్చినా పట్టిచుకోలేదు... - PRAJAVANI
కరీంనగర్ కలెక్టరేట్లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సరైన సమయానికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విధుల్లో వున్న అధికారులు అర్జీలు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.
116 సార్లు వచ్చినా పట్టిచుకోలేదు...