తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది. ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు డప్పు చప్పుళ్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకుండా తమ చిన్నారులను పాఠశాలకు పంపించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు కోరారు.
"ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకండి" - hh
కరీంనగర్ జిల్లాలో బడిబాట ముగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

"ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకండి"
TAGGED:
hh