తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షించిన కరోనా కిట్లను ఇష్టానుసారంగా పడేశారు.. - corona virus news

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పొట్టి రాజా రామ్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పీపీఈ కిట్​తో సహా పరీక్షించిన ర్యాపిడ్ కిట్లను ఇష్టానుసారంగా పడేశారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

పరీక్షించిన కరోనా కిట్లను ఇష్టానుసారంగా పడేశారు..
పరీక్షించిన కరోనా కిట్లను ఇష్టానుసారంగా పడేశారు..

By

Published : May 1, 2021, 6:04 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం చేస్తుంటే ఆస్పత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పొట్టి రాజా రామ్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆస్పత్రి ఆవరణలో ప్రతిరోజు 150 నుంచి 200 వరకు కరోనా పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షలకు ముందు ల్యాబ్ టెక్నీషియన్ వేసుకునే పీపీఈ కిట్​తో సహా పరీక్షించిన ర్యాపిడ్ కిట్లను ఇష్టానుసారంగా పడేశారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నా... ఆస్పత్రిలోని కిందిస్థాయి ఉద్యోగులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.

పరీక్షించిన కిట్లను ఇష్టానుసారంగా పడవేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి మరుసటి రోజు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారని... దీంతో కరోనాకు గురికాని వారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని భయపడుతున్నారు. జిల్లా వైద్య శాఖాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఏప్రిల్​లో నిమిషానికి 3 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details