tension at huzurabad: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో అధికార తెరాస - భాజపా సవాళ్లు - ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయం వేడి రగులుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10 నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావటంతో.. ఆయన వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ భాజపా రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
BJP TRS fight in Huzurabad : ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తెరాస, భాజపాల మధ్య అభివృద్ధి విషయమై సవాళ్లు-ప్రతి సవాళ్లు రాజుకున్నాయి. తెరాస చేస్తున్న అభివృద్ధే నియోజకవర్గంలో ఉందని.. ఈ విషయమై ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ బహిరంగ చర్చకు రావాలని కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. హుజూరాబాద్ అభివృద్ధి అంతా తాను చేసిందేనంటూ ఈటల.. కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది.