ప్రశ్న : టెలీ మెడిసిన్ ప్రారంభమయ్యాక ఫోన్ కాల్స్ ఏ విధంగా వస్తున్నాయి ?
జవాబు : గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి వార్డులో ఇంటింటి సర్వే చేపట్టాం. విదేశీయులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాం. అనుమానితులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా వ్యవస్థ లేదు కాబట్టి అవసరమైన వాళ్లు మమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తున్నారు. గైనిక్ సమస్యలపై ఫోన్ కాల్స్ వస్తున్నాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు, మూత్ర పిండాల రోగులు, చర్మ వ్యాధులపై సైతం ఫోన్లు చేస్తున్నారు. వారికి అవసరమైన మేర వైద్య సలహాలు, సూచనలు అందిస్తున్నాం.