రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కరీంనగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నేతలు నివాళి అర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు తమవంతుగా కృషిచేస్తూ.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రక్షణ కిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి' - కరీంనగర్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి
కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు.. తమవంతుగా కృషిచేస్తూ.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రక్షణ కిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కరీంనగర్లో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.
!['జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి' Telangana Union of Working Journalists Association Leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7450896-485-7450896-1591114522725.jpg)
'జర్నలిస్టులకు కరోనా రక్షణ కిట్లు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి'
ఈ మేరకు టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు గోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వార్తలు సేకరించి.. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం