తెలంగాణ

telangana

ETV Bharat / state

జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన హుజూరాబాద్ - minister etala visited huzurabad

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.

minister etala rajender hoisted national flag on the eve of telangana formation day
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన హుజూరాబాద్

By

Published : Jun 2, 2020, 11:56 AM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పూలమాల వేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా హుజూరాబాద్​లోని మంత్రి కార్యాలయంలో మంత్రి ఈటల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన ట్రాలీ ఆటోలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్​ ఛైర్​పర్సన్ నిర్మల, తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details