తెలంగాణ

telangana

ETV Bharat / state

'దసరా వరకు వంతెనపై వాహనాలు తిరగాలి' - telangana bc welfare minister gangula kamalakar

కరీంనగర్​లో రూ.183 కోట్లతో నిర్మిస్తున్న తీగల వంతెనపై రూ.3.5కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

telangana-minister-gangula-kamalakar-review-on-karimnagar-development-works
కరీంనగర్​లో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

By

Published : Jul 17, 2020, 10:31 AM IST

రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈఎన్​సీ రవీందర్​రావు, ఆర్​ అండ్ బీ అధికారులు, టాటా ప్రాజెక్టు ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్​లో మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్​పై రూ.3.5 కోట్లతో అత్యాధునిక డైనమిక్​ లైటింగ్​తో పాటు అండర్​ పాస్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని తెలిపారు. వంతెన పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని ​వెల్లడించారు.

అప్రోచ్​ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి దసరా వరకు బ్రిడ్జిపైకి వాహనాలు తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తీగల వంతెన పూర్తయితే నగరానికి పర్యటక శోభ సంతరించుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎలగందుల రహదారి పూర్తయితే ఖిల్లాకు వెళ్లేందుకు పర్యటకులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details