తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నో ఇబ్బందులు పడి.. ఎట్టకేలకు ఇండియాకు వచ్చాం' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Students Return from Ukraine: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం విద్యార్థులను భయాందోళనలకు గురిచేసింది. బంకర్లలో బిక్కుబిక్కుమంటూ కాలంవెల్లదీసి... ఎట్టకేలకు స్వదేశానికి వచ్చారు. పుట్టిన ఊరికి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి అనుభవాలేంటో ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

Students Return from Ukraine , karimnagar students from Ukraine
'ఎన్నో ఇబ్బందులు పడి.. బండి సంజయ్ చొరవతో ఇండియా వచ్చాం'

By

Published : Mar 5, 2022, 5:45 PM IST

Students Return from Ukraine: ఉక్రెయిన్​లో యుద్ధం.. బాంబుల మోత నడుమ భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. కంటిమీద కునుకు లేకుండా బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. స్వదేశానికి వచ్చేందుకు కిలోమీటర్ల కొద్దీ నడిచారు. గడ్డకట్టే చలిలో గంటల తరబడి నిరీక్షించారు. ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధం సమయంలో వారికి కలిగిన అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

సరిహద్దులకు కాలినడకన..

కరీంనగర్​కు చెందిన శిరీష రెడ్డి, రవి చంద్రిక ఎంబీబీఎస్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. వెనిషియాలోని ఓ వైద్య కళాశాలలో మెడిసిన్ చదువుతున్నారు. ఫిబ్రవరి 24న ఆ దేశంలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం నేపథ్యంలో తిండి, నీరు లేదని చెబుతున్నారు. నిద్రపోవడానికి స్థలం కూడా లేదని తెలిపారు. బస్సులో రొమేనియా సరిహద్దుకు చేరుకొని... పది కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చినట్లు పేర్కొన్నారు. వేలాదిమందికి ఇదే పరిస్థితి ఎదురైందని వివరించారు.

బండి సంజయ్ సాయంతో..

బుక్ ఏరియా యూరోపియన్లను ముందుగా సరిహద్దు దాటించడం వల్ల 'మా పరిస్థితిపై ఆందోళన కలిగిందని' విద్యార్థులు తెలిపారు. రెండు రోజుల పాటు ఆహారం లేదని చెప్పారు. రొమేనియా చేరిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు తమ పరిస్థితిని వివరించామని.. ఆయన తీసుకున్న శ్రద్ధతో వెంటనే బస్సులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. అక్కడి నుంచి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చేశామని వివరించారు.

ఉక్రెయిన్​లో ఫిబ్రవరి 24 నుంచి బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయని మాకు ఉదయాన్నే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వచ్చింది. ఆరోజు వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకున్నాం. ఒక వారానికి సరిపడా ఫుడ్ తెచ్చుకున్నాం. మేం లైన్లలో నిల్చున్నప్పుడే బాంబుల శబ్దాలు వినిపించాయి. సైరన్ మోగినప్పుడు బంకర్లలో ఉన్నాం. అక్కడ పడుకునేందుకు కూడా ప్లేస్ లేదు. 26నాడు మా కన్సల్టెన్సీ వాళ్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రొమేనియా వరకు చేర్చారు. కొంచెం దూరం నడిచివెళ్లాం. ఆ తర్వాత బండి సంజయ్​ కాల్ చేశారు. అప్పుడు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అలా ఇండియాకు చేరుకున్నాం.

-శిరీష రెడ్డి, వైద్య విద్యార్థిని

ఉక్రెయిన్​లో వార్ జరుగుతున్న యుద్ధం వల్ల ఫిబ్రవరి 24నుంచి మేం చాలా ఇబ్బందులు పడ్డాం. సైరన్ మోగగానే ఏడో ఫ్లోర్ నుంచి బంకర్లలోకి వెళ్లాం. అక్కడ కూర్చునే ప్లేస్ కూడా లేదు. ఆ తర్వాత బార్డర్ దగ్గరకు బస్సులు ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్లు నడిచాం. ఎంపీ బండి సంజయ్ గారి హెల్ప్​తో ఆ తర్వాత ఇబ్బంది లేకుండా వచ్చాం.

-రవి చంద్రిక, వైద్య విద్యార్థిని

మా కూతురు, కోడలు ఉక్రెయిన్​లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధం జరుగుతున్నప్పుడు పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. మేం కూడా చాలా భయపడ్డాం. ఈ ఏడు రోజులు మేం మానసికంగా చాలా బాధను అనుభవించాం. బండి సంజయ్ హామీతో పిల్లలు సురక్షితంగా ఇండియాకు వచ్చారు. ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు.

-అమరేందర్ రెడ్డి, శిరీష రెడ్డి తండ్రి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన కరీంనగర్ విద్యార్థులు

ఇదీ చదవండి:కూతురు ప్రేమ వివాహం.. పురుగుల మందు తాగిన తల్లిదండ్రులు

ABOUT THE AUTHOR

...view details