మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2019 బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ కరీంనగర్లో భాజపా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా బడ్జెట్‌ను రూపొందించడం అభినందనీయమన్నారు. బడ్జెట్లో 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రానికే అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
కేంద్రం బడ్జెట్ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే - karimnagar
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికే అధిక లబ్ధి జరిగిందని భాజపా మహిళా మోర్చా కరీంనగర్ పట్టణ అధ్యక్షురాలు గాజుల స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా భాజపా ఆధ్వర్యలో టాపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
కేంద్రం బడ్జెట్ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే