తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం: గంగుల - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

gangula kamalakar, telangana formation
గంగుల కమలాకర్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

By

Published : Jun 2, 2021, 11:59 AM IST

సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి... అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ అహింసాయుత పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం పరిపాలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అద్భుత ప్రగతితో రాష్ట్రం నేడు దూసుకుపోతోందన్నారు. అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో కరీంనగర్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:Harish rao: అమరవీరులకు మంత్రి హరీశ్‌ రావు నివాళులు

ABOUT THE AUTHOR

...view details