నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును మంత్రివర్గం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు సిఫారసు చేసింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి - హుజురాబాద్ ఉపఎన్నికల వార్తలు
telangana cabinet approves Kaushik Reddy as nominated MLC
21:52 August 01
నామినేటెడ్ ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవలే తెరాసలో చేరారు. సీఎం కేసీఆర్.. కౌశిక్‌రెడ్డికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ‘తెరాస టికెట్ తనకేనంటూ ఓ నాయకుడితో ఆడియో సంభాషణ’బయటపడిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, అభిమానులతో సంప్రదింపులు జరిపిన తరువాత తెరాసలో చేరిపోయారు.
Last Updated : Aug 1, 2021, 10:32 PM IST