దేశ ప్రజలు కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సైన్యానికి నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ ఉత్తేజాన్ని ఇస్తూ దేశ ప్రజలను సంఘటితం చేశారని అన్నారు. అనేక మంది సైనికులు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి అనేకమంది ప్రాణ త్యాగం చేశారని.. వారి ప్రాణత్యాగం ఎంతో విలువైనదని కొనియాడారు.
'కార్గిల్ స్ఫూర్తితో చైనా కుతంత్రాలను సైనికులు ఛేదిస్తారు' - vijay divas latest news
కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుట్ర కుతంత్రాలను భారత సైనికులు ఛేదిస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారు.
bandi sanjay kumar
దేశ ప్రజలు దేశభక్తిని పెంపొందించడం, దేశం కోసం పోరాడడం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవిధంగా చేయడాన్ని విజయ్ దివాస్ ఒక గుర్తింపును సంతరించుకున్నదన్నారు. కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుట్ర కుతంత్రాలను భారత సైనికులు ఛేదిస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. సైనికులకు ప్రధాని మోదీ, ప్రజలు బాసటగా నిలవాలని కోరారు.