భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దీక్షను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి, కేసు నమోదుచేయాలన్న డిమాండ్‌తో.. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలోనే నిరసన కొనసాగిస్తున్నారు. సీపీని సస్పెండ్ చేసే వరకూ దీక్ష విరమించబోనని సంజయ్ స్పష్టం చేశారు.
సోమవారం.. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోదాలు జరిగాయి. పరామర్శించేందుకు దుబ్బాక బయలుదేరిన బండి సంజయ్‌ను.. సిద్దిపేట శివార్లలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేసే క్రమంలో సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్... చేయి చేసుకున్నారని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడినని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. జోయల్ డేవిస్‌పై చర్యలు తీసుకోవాలంటూ దీక్షకు దిగారు.