ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ.. సంఘం సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
'ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి' - మెట్ల పారితోషికం
ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని.. కరీంనగర్ జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది.

'ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి'
ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు కుమార్. మేట్ల పారితోషికాన్ని రూ. 5కు పెంచాలని కోరారు. కూలీలకు 200 పనిదినాలను కల్పిస్తూ.. రోజుకు రూ. 600 వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:జోగులాంబ జిల్లాలో జోరుగా క్యాట్‌ఫిష్ సాగు