కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ ఆధ్వర్యంలో కళాకారులు తెలంగాణ ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా కళాకారులు ప్రదర్శించారు. కళాకారులు ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కేసీఆర్‌ను ఈటల వెన్నుపోటు పొడిచారు..
పార్టీలో గౌరవం లేకనే ఆత్మ గౌరవం కోసం బయటికి వెళ్లానని ఈటల రాజేందర్ చెప్పటం శోచనీయమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ అన్నారు. ఈటలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే పార్టీకి... మఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. దళితుల, బడుగు బలహీన వర్గాల భూములను ఆక్రమించుకొని ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల భాజపాలో చేరారని గువ్వల బాలరాజ్ అన్నారు.