కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో తెదేపా పార్టీ నాయకులు 3రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర దీక్షలకు పూనుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డితో పాటు 20 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా బాధితులకు సేవలందిస్తూ.. వైరస్ బారినపడి మృత్యువాత పడ్డ వైద్యులు, వైద్య సిబ్బందికి, కరోనాతో మరణించిన పోలీసులకు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెదేపా దీక్ష - కరోనా చికిత్స
కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర తెదేపా పార్టీ నాయకులు 3రోజుల పాటు రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి 50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెదేపా నిరసన
నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. అర్హులైన వారిందరికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్