కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్నుల వసూలు జోరందుకుంది. పురపాలక సంస్థ ఎన్నికల్లో పోటీచేసే ఆశావాహులు తమ బకాయిలు చెల్లిస్తున్నారు. పన్ను చెల్లించడానికి అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒక్క రోజే నగరపాలక సంస్థకు రూ.15 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో ఆస్తి పన్ను రూ.8. 60 లక్షలు, నల్ల బిల్లు రూ.6.50 లక్షలు వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.
ఒక్క రోజే రూ.15 లక్షల పన్నుల చెల్లింపు - తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
పురపాలక ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం వస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎలాంటి బకాయి ఉండొద్దని నిబంధన ఉండడం వల్ల అభ్యర్థులు ఇంటి పన్ను, నల్ల పన్ను చెల్లిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒక్క రోజే రూ.15 లక్షల పన్నులు వసూలయ్యాయి.

ఒక్క రోజే రూ.15 లక్షల పన్నుల చెల్లింపు