కరీంనగర్ నగరంలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఫైనాన్స్ నడుపుతున్న సంస్థలపై పోలీసుల దాడులు చేశారు. వారి నుంచి పలు పత్రాలు, చెక్కులను స్వాధీనం చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సమయంలో ఉజ్వల ఫైనాన్స్ బాధితులు కొందరు మీడియా సమావేశం నిర్వహించారు. ఐదు, పది రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారని... ఒక వేళ కట్టకుంటే... తమ ఆస్తులను కబ్జా చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఉజ్వల ఫైనాన్స్‌పై చర్యలు తీసుకోవాలి: బాధితులు - karimnagar latest news
ఎలాంటి అనుమతులు లేకుండా కరీంనగర్లో నడుపుతున్న ఉజ్వల ఫైనాన్స్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఐదు, పది రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారని... ఒక వేళ కట్టకుంటే... తమ ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
ujwala finance
ఎలాంటి అనుమతులు లేకుండా భీమనాథుని సుధాకర్ అనే వ్యక్తి ఉజ్వల ఫైనాన్స్ నడుపుతున్నాడని బాధితులు తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ... కట్టకుంటే తమను బెదిరించి భూములు, ఇళ్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్వల ఫైనాన్సుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :ఎనిమిదేళ్లైనా పైసా ఇయ్యలే... ఆదుకోండి సార్లూ!