ఈత కోసం వెళ్లి ఇద్దరి మృతి... ఇద్దరి కోసం గాలింపు - two members died
కరీంనగర్ జిల్లా కొలనూరులోని ఊర చెరువులో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతంలో నీట మునిగారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇద్దరి మృతి... ఇద్దరి కోసం గాలింపు
కరీంనగర్ జిల్లా ఓదెల మండల కొలనూరు ఊర చెరువులో ఈత నేర్చుకోవడానికి వెళ్లి నలుగురు వ్యక్తులు గల్లంతైన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాతూరి రాజయ్య తన మనవళ్లు సిద్దార్థ్, ఆదర్శ్, లిట్టుకు ఈత నేర్పుతుండగా ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతంలో నీట మునిగి గల్లంతయ్యారు. స్థానికుల సాయంతో వెతకగా రాజయ్య, సిద్దార్థ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదర్శ్, లిట్టు కోసం గాలిస్తున్నారు.