తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామపంచాయతీల భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - choppadandi mla land opening news

గ్రామపంచాయతీల నూతన భవనాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ నిర్వహిచారు. మిషన్ భగీరథ పథకంతో అన్ని గ్రామాలకు త్వరలో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.

Sunke Ravishankar, MLA, who worshiped the land of the Gram Panchayats
గ్రామపంచాయతీల భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

By

Published : Dec 23, 2020, 3:37 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ మంగపేట గ్రామపంచాయతీల నూతన భవనాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేశారు. అలాగే మున్నూరుకాపు సంఘ భవనాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహిచారు.

పల్లెల అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో అన్ని గ్రామాలకు త్వరలో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ పథకంతో ఇప్పటికే చెరువులు నిండి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు.

ఇదీ చూడండి:కోలుకున్నాక 8 నెలల వరకు బేఫికర్​!

ABOUT THE AUTHOR

...view details