తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య - The event at Chigurumamadi Mandal Domanapalli in Karimnagar district

చిగురుమామిడి మండలంలో ఓరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొమ్మనపల్లి గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడగ్గా వారు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని తెలిపారు.

Suicide of a farmer in Chigurumamudi zone
చిగురుమామిడి మండలంలో రైతు ఆత్మహత్య

By

Published : Jun 4, 2020, 7:23 PM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో బాలయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలయ్యకు అతని సోదరునికి మధ్య భూ పంపకాల విషయంలో.. గత కొన్ని రోజులుగా తగాదాలు నడుస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

భూతగాదా కారణం..?

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. భూతగాదా కారణంగానే మనస్పర్థకులోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై గ్రామస్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడగగా వారు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని తెలిపారు.

ఇదీ చూడండి:డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ABOUT THE AUTHOR

...view details