కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ ఎదుట ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ చిట్‌ఫండ్‌లో రూ.20 లక్షల చిట్టీ వేసినట్లు తెలిపాడు. అయితే ఆ చిట్టీ డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రతిసారి దాటావేస్తున్నారని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్ ఫండ్ ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చిట్టీ డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం - కరీంనగర్ జిల్లా హుజూరాబాద్
రూ.20 లక్షల చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.
చిట్టీ డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం