శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలోని పలు గ్రామాల అభివృద్ధిలో భవన నిర్మాణ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించాలని.. సంస్థ ఛైర్మన్ జీవి రామకృష్ణరావు కోరారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణాల అనుమతులపై అధికారులను ఆరా తీశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ భవనంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
'నిర్మాణాల అనుమతుల్లో జాప్యం జరగకుండా చూడండి' - సుడా ఛైర్మన్ జీవి రామకృష్ణరావు
శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలోని పలు గ్రామాలపై.. సంస్ధ ఛైర్మన్ దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లా పరిషత్ భవనంలో.. మున్సిపల్ కమిషనర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
!['నిర్మాణాల అనుమతుల్లో జాప్యం జరగకుండా చూడండి' The Suda chairman focused on several villages under the Satavahana Urban Development Corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10644299-192-10644299-1613450622985.jpg)
'అనుమతులు విషయంలో.. జాప్యం వద్దు'
ప్రణాళిక ప్రకారం అనుమతుల్లో జాప్యం జరగకుండా చూడాలని.. ఛైర్మన్, సంబంధిత అధికారులను కోరారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీఓ, సీపీఓ, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:ప్రగతి జాడ లేని 'దళిత వాడ'