కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడు జగిత్యాల జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన విజయ్‌గా పోలీసులు గుర్తించారు.
'సీపీ కార్యాలయం ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం' - sucide attempt at cp office news
ఓ ప్రజాప్రతినిధి తనను వేధిస్తున్నారని... పోలీసు అధికారి సైతం వారికి సహకరిస్తున్నాడని ఓ యువకుడు సీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ ప్రజాప్రతినిధి... అతని అనుచరులు రాజకీయ కక్షతో వేధిస్తున్నారని విజయ్ ఆరోపించాడు. వీరికి ఓ పోలీస్ అధికారి సైతం సహకరిస్తున్నాడని తెలిపాడు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్‌లోని సీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుమందు డబ్బా తీసి తాగాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:కొత్త ప్రాజెక్టులు ఆపండి... రెండు రాష్ట్రాలకు కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ