కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంపుహౌస్‌లో నాలుగో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంపుహౌస్‌లో ఆగస్టు 11న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. అనంతరం మరో రెండు పంపులను పరీక్షించారు. అప్పటి నుంచి నిరాటంకంగా గోదావరి జలాలు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12 టీఎంసీల నీటిని రాజరాజేశ్వర జలాశయానికి తరలించారు. తాజాగా మరో పంపు వెట్‌రన్ పూర్తి కావటం వల్ల 12 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విజయవంతమైన నాలుగో పంపు వెట్‌రన్ - http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/31-August-2019/4303155_krn_gayatri_rp.mp4
కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి ఎత్తిపోతలలో మరో ముందడుగు పడింది. ఇప్పటి వరకు మూడు పంపుల వెట్‌రన్ పరీక్షలు సత్ఫలితాలనివ్వగా... తాజాగా పరీక్షించిన నాలుగో పంపు వెట్‌రన్ విజయవంతమైంది.
Successful fourth pump vet run