తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్ - ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్

పుస్తకాలు పట్టిన చేతులు చీపుర్లు పట్టి పరిసరాలు శుభ్రం చేశాయి. మోదీ స్వచ్ఛభారత్​ మిషన్​లో మేము భాగస్వాములం అవుతామని... ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్​ విద్యార్థులు కరీంనగర్ ఆర్​టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛభారత్​ నిర్వహించారు.

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్

By

Published : Sep 21, 2019, 4:54 PM IST

ఇంగ్లీష్​ యూనియన్​ హైస్కూల్, జ్యోతిష్మతి పాఠశాల​ విద్యార్థులు కరీంనగర్ ఆర్​టీసీ ప్రయాణ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. చీపురు, తట్టలు పట్టి చెత్తను తొలగించారు. కరీంనగర్​ రీజియన్​ మేనేజర్​ జీవన్ ప్రసాద్​ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. వ్యక్తిగత, కుటుంబ పరిశుభ్రత పాటించకపోతే అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. ప్లాస్టిక్​ వాడకం తగ్గించి, భవిష్యత్​ తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరారు.

కరీంనగర్​ బస్టాండ్​లో విద్యార్థుల స్వచ్ఛభారత్

ABOUT THE AUTHOR

...view details