విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పనితీరుపై ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ధ్వంసానికి నిరసనగా మే 5న కరీంనగర్లో నిరసన ర్యాలీ చేస్తామన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థులు బలి - ఇంటర్నీడియట్ బోర్డు
ప్రభుత్వం అసమర్థత కారణంగా ఇంటర్ విద్యార్థులు బలైపోయారని ప్రజాసంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం మండిపడ్డారు. మరణించిన విద్యార్థులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థులు బలి